తాజా వార్తలు

అలర్ట్.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కేంద్ర వైద్య బృందం

అలర్ట్.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కేంద్ర వైద్య బృందం
X

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ వార్తలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర బృందం ఇప్పటికే హైదరాబాద్‌లో పర్యటిస్తోంది. ఈ బృందంలో ఏడు రాష్ట్రాలకు చెందిన 35మంది డాక్టర్లున్నారు. గాంధీ, ఫీవర్‌, చెస్ట్ ఆస్పత్రులను ఈ టీం పరిశీలిస్తుంది. ఆస్పత్రుల్లో ఐసోలేటెడ్‌ వార్డులు, ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ సెంటర్‌ను పరిశీలిస్తుంది. తర్వాత సీఎస్‌తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనుంది. పుణెకు పంపిన ఇద్దరు బాధితుల రక్త నమూనాలు నెగెటివ్‌ అని వచ్చాయి. మరో ఇద్దరికి అలాంటి లక్షణాలే లేవని అధికారులు తేల్చారు. అటు.. విశాఖ ఎయిర్‌పోర్టులోనూ కరోనా అలర్ట్‌ కొనసాగుతోంది.

Next Story

RELATED STORIES