ట్రాన్స్‌జెండర్‌ను వివాహమాడిన సాప్ట్‌వేర్ ఉద్యోగి..

ట్రాన్స్‌జెండర్‌ను వివాహమాడిన సాప్ట్‌వేర్ ఉద్యోగి..
X

ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్నారు. కేరళకు చెందిన హైదిసాదియా అబ్బాయిగా పుట్టినా ఎదుగుతున్న క్రమంలో అమ్మాయి లక్షణాలు కనిపించేవి. అమ్మాయిగా లింగ మార్పిడి చేయించుకుంటానంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోగా ఇంటి నుంచి గెంటేశారు. విషయం తెలిసి మరో ట్రాన్స్‌జెండర్ హైదీని చేరదీసి చదువు చెప్పించింది. ఉన్నత చదువులు చదువుకున్న హైదీ ఓ టీవీ ఛానెల్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తోంది.

ఉద్యోగం చేస్తున్న హైదీగా పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తుంటే ఆమెను చేసుకోవడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. హైదీ విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి పరిచయమయ్యాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. అతడు అధర్వ్‌మోహన్ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అధర్వ్ కూడా అనాధ కావడంతో ఓ జంట అతడిని పెంచి పెద్ద చేసింది. హైదీని పెళ్లి చేసుకుంటానని చెబితే పెంచిన తల్లిదండ్రులు కాదనలేకపోయారు. ఇరువురి బంధువుల సమక్షంలో వారి వివాహం జరిగింది.

Next Story

RELATED STORIES