తెలుగు రాష్ట్రాలను తాకిన కరోనా భయం!

తెలుగు రాష్ట్రాలను తాకిన కరోనా భయం!

చైనాలో ప్రబలిన కరోనా ఇతర దేశాలను సైతం వణికిస్తోంది. మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తుండటంతో భారత్ కూడా అప్రమత్తమైంది. కరోనా ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలను కూడా తాకింది. వైరస్ వ్యాప్తి చెదుతున్న వ్యూహాన్ నగరంలో 53 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో చైనా ప్రభుత్వం వారిని గది నుంచి బయటికి రాకుండా కట్టుదిట్టం చేసింది. దీంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

వ్యూహాన్ నగరంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల్లో.. తిరుపతికి చెందిన విష్ణుప్రియ కూడా వుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తన కుమార్తెను సురక్షితంగా భారత్ కు తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు విష్ణుప్రియ తండ్రి సుబ్రహ్మణ్యం. ఆయన టీవీ5తో తన ఆవేదన వ్యక్త చేశారు.

తన కుమార్తెతో రోజూ ఫోన్లో మాట్లాడుతున్నానని సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే, వ్యూహాన్ నగరంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం పట్ల ఆందోళన చెందుతున్నానని అన్నారు. తన కుమార్తెతో పాటు తెలుగు విద్యార్థులందరినీ రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story