ఆ సినిమాలో అమ్మగా నటించమని అడిగితే..

ఆ సినిమాలో అమ్మగా నటించమని అడిగితే..
X

హీరోయిన్‌గా ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే నటించినా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు రేణూ దేశాయ్. ఇద్దరు బిడ్డల్ని ఒంటరిగా పెంచుతూ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. కవితలు రాస్తూ, బుల్లితెర మీద కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉంటు. తాజాగా ఓ సినిమాకు డైరక్షన్‌ కూడా చేస్తున్నారు. పెళ్లి చూపులు, మెంటల్ మదిలో చిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి తన కుమారుడు శివను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ నిర్మించిన చూసీ చూడంగానే చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రేణూ ముఖ్య అతిధిగా విచ్చేశారు. చిత్ర దర్శకుడు ఈ చిత్రంలో తనను తల్లి పాత్ర చేయమని అడిగారు. ఇష్టం ఉన్నా చేయలేకపోయాను. అనారోగ్య కారణంగా ఆఫర్‌ని వదులుకున్నానని చెప్పారు. మంచి అవకాశాలు వస్తే సినిమాల్లో నటిస్తానని చెప్పారు. ఇండస్ట్రీలోకి మహిళా టెక్నీషియన్లు ఎక్కువమంది రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

Next Story

RELATED STORIES