పవన్ 'పింక్' సినిమాలో రేణూ క్యారెక్టర్..?

పవన్ పింక్ సినిమాలో రేణూ క్యారెక్టర్..?
X

క్రేజీ హీరోగా అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగుతానని, సినిమాల్లోకి వెళ్లే ప్రసక్తి లేదని పలు సందర్భాల్లో చెప్పిన ఆయన.. మాటమార్చి మరి కధ నచ్చో లేక అభిమానుల కోసమో కానీ బాలీవుడ్ హిట్ మూవీ 'పింక్' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన లాయర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసే మరోవార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమాలో రేణూ దేశాయ్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారని. ఒక పిల్లవాడికి తల్లి పాత్రలో రేణు నటిస్తారని తెలుస్తోంది. తల్లి పాత్రలు చేయడానికి సిద్దమేనంటూ స్టేట్మెంట్ ఇచ్చిన రేణూకి ఈ ఆఫర్ వెళ్లినట్లు సమాచారం. పవన్ సినిమాలో చేసేందుకు రేణుని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట దర్శకుడు. ఈ ఇద్దరూ కలిసి ఇదివరకు జానీ, బద్రి సినిమాల్లో నటించారు. మరి పవన్ ఫ్యాన్స్‌కి ఈ వార్త పండగలాంటిదే. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

Next Story

RELATED STORIES