తాజా వార్తలు

సూర్యాపేట మున్సిపాలిటీలో పదవుల పంచాయితీ

సూర్యాపేట మున్సిపాలిటీలో పదవుల పంచాయితీ
X

సూర్యాపేట మున్సిపాలిటీలో పదవుల కోసం అధికార పార్టీ టీఆర్ఎస్‌లో పంచాయితీ నెలకొంది. తమ కౌన్సిలర్‌కు వైస్‌ ఛైర్మన్‌ పదవీ దక్కలేదని ఓ టీఆర్‌ఎస్‌ కార్యకర్త పెట్రోల్‌ పోసుకున్నాడు. నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్నవాళ్లు అతన్ని నివారించడంతో ప్రమాదం తప్పింది. పట్టణంలోని 5వ వార్డు కౌన్సిలర్‌ భాష ప్రత్యక్ష ఎన్నికల్లో వైస్‌ చైర్మన్‌ పదవి ఆశించాడు. చివరికి అతనికి పదవీ దక్కకపోవడంతో.. ఆ కౌన్సిలర్‌కు సంబంధించిన ఓ కార్యకర్త ఆవేదనతో పెట్రోల్‌ పోసుకున్నాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Next Story

RELATED STORIES