సూపర్ రాజా.. ఫ్రెష్ జ్యూస్ ఫ్రూట్ గ్లాసుల్లో..

సూపర్ రాజా.. ఫ్రెష్ జ్యూస్ ఫ్రూట్ గ్లాసుల్లో..

సమాజానికి మన వంతు కొంతైనా చేద్దామని కొత్తగా ఆలోచించారు బెంగళూరుకు చెందిన రాజా. ఇంజనీరింగ్ చదివిన అతడు తండ్రి నడిపిన జ్యూస్‌ షాప్ నిర్వహణ బాధ్యతలు చేపట్టాడు. నిజానికి ఐటీ కారిడార్ బెంగళూరులోని మల్లేశ్వరంలో 40 ఏళ్ల నుంచి తండ్రి ఆ జ్యూస్ షాపుని నడిపేవాడు. తండ్రి మరణానంతరం తల్లి షాపు చూసుకునేది. కొడుకు ఆనంద్ చదువుకుంటున్నాడని షాప్ బాధ్యతలు అప్పగించలేకపోయింది తల్లి. కానీ వినూత్నంగా ఏదైనా చెయ్యాలని ఆలోచించిన ఆనంద్‌కి తమ జ్యూస్ షాపే వేదికైంది.

ప్లాస్టిక్ గ్లాస్‌లో జ్యూస్ తాగడం అవి పడేయడం.. ప్లాస్టిక్ వలన పర్యావరణానికి హానీ. పోనీ గాజు గ్లాసుల్లో పోసినా తాగిన తరువాత వాటిని కడగడానికి చాలా నీళ్లు వృధాగా పోతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ జ్యూస్ తీసిన పండ్లలోనే పోసి ఇస్తే కొన్నింటిని అలాగే తినేయొచ్చుకూడా అని ఆలోచన చేశాడు. అనుకున్నదే తడవుగా ఆ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. మంచి స్పందన రావడంతో ఈట్ రాజా షాప్‌ ఫేమస్ అయిపోయింది. జామకాయ జ్యూస్ చేసినా కాయలోని లోపలి గుజ్జంతా జ్యూస్ చేసి అందులోనే పోసి ఇస్తారు. పండ్లకు సంబంధించి వేస్ట్ వస్తే దాన్ని బయో ఎంజైమ్‌లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కస్టమర్లు జ్యూస్ తాగుతూ ఆ పండు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story