కరీబియన్‌ దీవుల్లో భారీ భూకంపం

కరీబియన్‌ దీవుల్లో భారీ భూకంపం

కరీబియన్‌ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. క్యూబా నుంచి 87 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మాంటెగో బే సముద్రం అంతర్భాగంలో భూ కంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. జమైకా, క్యూబాలను కూడా భూ ప్రకంపనలు తాకాయి. భూకంప తీవ్రత దృష్ట్యా సునామీ హెచ్చ రికలు కూడా జారీ చేశారు.

భూకంప తీవ్రతకు కరీబియన్ దీవులు అల్లాడిపోయాయి. ఇళ్లు, భవనాలు ఊగిపోయాయి. చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంప కేంద్రం నుంచి సముద్ర తీర ప్రాంతానికి 300 కిలోమీటర్ల వరకు సునామీ తరంగాలు వస్తున్నట్టు పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. క్యూబా, హోండూరస్, మెక్సికో, కేమన్, బెలిజ్, జమైకాలోని పలు ప్రాంతాలకు సునామీ ప్రమాదం పొంచి వుందని పేర్కొంది. జార్జ్ టౌన్‌లోని కేమాన్ దీవులలో సునామీ ప్రభావం కనిపించింది. సముద్రంలో అలలు పోటెత్తాయి. డొమినికన్ రిపబ్లిక్‌లోని పోర్ట్ రాయల్, ప్యూర్టో ప్లాటా వద్ద మాతర్ం సునామీ కని పించలేదు.

Tags

Read MoreRead Less
Next Story