మండలి మా గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు : నారా లోకేష్

మండలి మా గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు : నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు వివాదస్పదంగా మారుతున్నాయి. ప్రతీ నిర్ణయం వెనుక కుట్ర రాజకీయాలు, కూల్చివేత రాజకీయాలు దాగి ఉందని అంటున్నారు విపక్ష పార్టీల నేతలు. 3 రాజధానులపై ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోవాలని హితువు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మండలి మా గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణేగానీ, రాజధాని వికేంద్రీకరణ కాదని అన్నారు లోకేష్.

అధికారంలోకి రాకముందు రైతే రాజన్న జగన్.. నేడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి అఖిలప్రియ. ప్రభుత్వానికి మూడు రాజధానులపై వున్న శ్రద్ధ రైతులపై లేదని మండిపడ్డారు.

రైతు సంక్షేమం, సామాన్యుల సంక్షేమం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం..సమాన్యులు, రైతులనే దోపిడి చేస్తోందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ పెంచటాన్ని తప్పుబట్టారు. అధికారంలో వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 7 లక్షల తెల్లకార్డులను తొలగించిందని ఆరోపించారు.

అటు బీజేపీ నేతలు కూడా జగన్ ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతున్నాయి. ఏపీకి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్. రివర్స్ టెండర్స్ అంటూ జగన్ ప్రభుత్వం ప్రజల అంచనాలకు రివర్స్ లో పరిపాలిస్తోందని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story