ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం

ఉభయ సభల ఆమోదంతో పౌరసత్వ బిల్లు తీసుకువచ్చామన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌. సీఏఏ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన హామీ ఇచ్చారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి సెంట్రల్‌ హాల్‌లో ఆయన సుదీర్ఘంగా ప్రసగించారు. మన రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ రక్షణ కల్పిస్తుందన్నారు. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన భారత పౌరులకీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందన్నారు. అయితే సీసీఏపై రాష్ట్ర ప్రతి ప్రసంగిస్తుంటే మరోవైపు విపక్షాలు గట్టిగా నినాదాలుచేశాయి. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది.

ప్రపంచంలో భారత్‌ ప్రభల శక్తిగా ఎదుగుతోంది అన్నారు. ఈ దశాబ్దంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు భారతదేశం చేరుకుంటుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్ని కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు సమానప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

అయోద్య తీర్పును ప్రజలంతా స్వాగతించారన్నారు రాపష్ట్రతి రామ్‌నాథ్‌ కోవింద్‌. రామ మందిర నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. త్వరలో నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story