నిర్భయ కేసులో ట్విస్ట్.. నలుగురికి కాదు.. ముగ్గురికే ఉరి

నిర్భయ కేసులో ట్విస్ట్.. నలుగురికి కాదు.. ముగ్గురికే ఉరి
X

నిర్భయ కేసులో మళ్లీ ట్విస్ట్‌ ఎదురైంది. నిర్భయ దోషుల ఉరి రోజుకో మలుపు తిరుగుతోంది. నలుగురు దోషుల క్షమాభిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి మూడు రోజుల కిందే తిరస్కరించారు. దీంతో ఆ దోషులను శనివారం ఉరి తీయడం దాదాపు ఖాయమనే అనుకున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా అయ్యాయి. తలారి సైతం తీహార్‌ జైలుకు చేరుకున్నారు. ఉదయం నలుగురుకీ ఉరిశిక్ష ఖాయం అనుకున్నారు అంతా.. అయితే రాష్ట్రపతి క్షమాభిక్షను కోరుతూ వినయ్ శర్మ పిటీషన్‌ను దాఖలు చేశాడు. ఆ పిటీషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. వినయ్ శర్మ పిటీషన్ పెండింగ్‌లో ఉన్నందున అతడి ఉరి శిక్ష వాయిదా పడుతుందని తీహార్ జైలు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ అన్నారు. ఇందులో వేరే ఉద్దేశమేది లేదని ఆయన అన్నారు. కాగా.. మిగతా దోషులను ముందు అనుకున్నట్లుగానే జైలు అధికారులు ఉరి తీస్తారని ఆయన అన్నారు.

Tags

Next Story