చీమల చట్నీ, పాముల పలావ్.. అన్నీ ఇలాంటి వంటలే.. అందుకేనా 'కరోనా'..

చీమల చట్నీ, పాముల పలావ్.. అన్నీ ఇలాంటి వంటలే.. అందుకేనా కరోనా..

పాకేవి, నడిచేవి, ఎగిరేవి, ఈదేవి ఏదైనా వారి పంటికింద పలహారం అవ్వాల్సిందే. దేన్నీ వదిలిపెట్టరు. తేనెటీగలు పువ్వుల్లోని మకరందాన్ని సేకరించి తుట్టెలో నింపుతుంది. దాన్ని పిండి మనం తేనె తీసుకుంటే చైనీయులు మాత్రం ఏకంగా తేనెటీగల్నీ పట్టి నూనెలో ఫ్రై చేసి అందిస్తారు. భలే ఉంది అని ఆస్వాదిస్తారు. పాము.. ఆ పేరు వింటేనే వళ్లంతా జలదరిస్తుంది. అక్కడ అదే స్పెషల్. పాము వంటకాల కోసమనే ప్రత్యేకంగా స్నేక్ రెస్టారెంట్లు వెలిశాయంటే నమ్మగలమా. వాక్.. చదువుతుంటే వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది కదా.

వేడి వేడి పాము సూపు, ఎర్రగా వేగించిన ప్రాము ఫ్రై అంటే చైనీయులకు నోరూరుతుంది. ఎన్ని వెరైటీలో ఎందెందో వెదకక్కరలేదు. వీధికో వెరైటీ రెస్టారెంట్ వెలుస్తుంది. అక్కడ ఓ ప్రత్యేక డిష్ చైనీయుల కోసం రెడీ అవుతుంది. తెల్లగా, ముద్దుగా ఉండే రాబిట్‌ని చూస్తే పట్టుకుని ప్రేమగా తల నిమరాలనిపిస్తుంది మనకు. కానీ చైనీయులకు మాత్రం చిల్లీ రాబిట్ హెడ్ అంటే మహా ఇష్టం. అక్కడ అది ఫేమస్ డిష్ కూడా. చైనాలోని సిచుహాన్ ఫ్రావిన్స్‌లోని చెంగ్డూలో ఇది ఎక్కువగా లభిస్తుంది. పావురాలను పట్టి నూనెలో ఫ్రై చేసుకుని లాగించేస్తారు.

ఇంట్లో ఎప్పుడైనా గుడ్లు తెచ్చి నెల రోజులైందంటే మురిగిపోయి ఉంటాయని పడేస్తాము. కానీ చైనీయులు మాత్రం ఎంత మురిగితే అంత టేస్ట్ వస్తుందని వెయ్యేళ్ల నాటి గుడ్డుని కూడా వదిలి పెట్టకుండా తినేస్తారు. అది జెల్లీలా సాగుతుంటే భలే టేస్ట్‌గా ఉంటుందని ఊరించుకుంటూ తింటారు. బీజింగ్‌లోని వాంగ్‌పుజింగ్ రోడ్‌లో ఏర్పాటు చేసే నైట్ మార్కెట్‌లో అడుగు పెట్టాలంటే కీటకాలు కూడా భయపడతాయి. వాటికి అదే ఆఖరి రోజు మరి.

మటన్ పులావ్, మేక మాంసం అంటే ఇండియన్స్‌కి ఎంతిష్టమో అక్కడ కుక్కతో అలాంటి వంటలు చేస్తారు. ఇండియాలో మటన్ పలావ్ పేరుతో కుక్కల వంటకాలను తయారు చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. జాగ్రత్త సుమా. బయటకు వెళ్లినప్పుడు మాంసాహార వంటకాలు వీలైనంత వరకు తినకపోవడమే మంచిది. పక్షుల లాలాజలాన్ని కూడా వదిలిపెట్టరు 'మహానుభావులు'. దాన్ని ఎండబెట్టి సూప్ చేసుకుని తాగితే భలేగా ఉంటుంది అంటారు. పైగా దీన్లో బోలెడు ఔషధ గుణాలు కూడా ఉంటాయని నమ్ముతారు. ఇది చాలా అరుదుగా లభిస్తుంది. అందుకే రేటు కూడా చాలా ఎక్కువే అంటారు. డబ్బున్న మారాజులు మాత్రమే లాలాజల సూప్‌ని ఆర్డర్ ఇస్తారు.

అన్నటికంటే దారుణం కోతిని పట్టుకుని నానా చిత్ర హింసలకు గురిచేసి ఆకలి తీర్చుకుంటారు. బతికున్న కోతి తల బయటకు కనిపించేలా బోనులో పెడతారు. ఆ బోను తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ కింద పెడతారు. టెబుల్‌కి ఉన్న రంధ్రం నుంచి కోతి పుర్రెను పగలగొడతారు. అది బాధతో అరుస్తుంటే దాని మెదడును అలాగే పచ్చిగా తింటూ ఆనందిస్తారు. మిగిలిన జంతువులు, పక్షుల మాంసాలన్నీ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తే.. ఈ కోతి మెదడు మాత్రం నాలుగ్గోడల మధ్య ఎవరికి తినాలనిపించినప్పుడు వారు తెచ్చుకుని ఈ విధంగా తింటారు.

ప్రస్తుతం 'కరోనా' వైరస్ బారిన పడిన ఊహాన్‌లో పర్మిషన్ లేకుండా పలు జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నారు. అందులో నక్కలు, కుక్కలు, ఎలుకలు, బొద్దింకలు ఎన్నని చెప్పాలి. అన్ని జీవులు అక్కడ దొరుకుతాయి. ఒక్క మనిషిని మాత్రమే వదిలిపెడతారేమో. అన్ని జంతువులను అలా ఎలా తినేస్తారు మీరసలు మనుషులేనా అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఎంత మంచి సమాధానమో వస్తుంది వారి నుంచి.. అది.. ఏదైనా ఇక జీవిని చంపినప్పుడు దాని శరీరాన్ని వృధాగా పడేయకూడదని, దాన్ని ఆహారంగా తిని కడుపు నింపుకోవాలని బౌద్దులు నమ్మేవారని చెబుతుంటారు. అదే చైనీయులకు అలవాటుగా మారిపోయిందని అమెరికాలో స్థిరపడిన జోసెఫ్ వాంగ్ అనే వ్యక్తి తెలిపారు. ఒక్కో జంతువులో ఒక్కో ఔషధ గుణం ఉంటుందని వాంగ్ అంటున్నారు. అయితే చైనాలో నివసిస్తున్న అందరూ కాదండి కొందరు మాత్రమే ఇలాంటి ఆహారపు అలవాట్లతో ఉంటారు. చాలా మంది చైనీయులు చెట్ల ఆకులు, వేళ్లు, కూరగాయలు తిని జీవిస్తుంటారు. కాబట్టి చైనీయులందర్నీ ఒకే గాటన కట్టేయకూడదు. ఏదేమైనా నా తిండి.. నా ఇష్టం అంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ది అని పెద్దలు ఊరికే అనలేదు మరి.

Tags

Read MoreRead Less
Next Story