వుహాన్‌ సిటీ నుండి ఢిల్లీకి వచ్చిన 324 మంది భారతీయులు

కరోనా వైరస్‌పై భారత్‌ అప్రమత్తం అయింది. వుహాన్‌లో ఉన్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వుహాన్‌ సిటీకి ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానాన్ని పంపి.. తొలి విడతగా 324 మందిని ఢిల్లీకి తీసుకువచ్చారు. వచ్చిన వారిలో ఏపీకి చెందిన 56 మంది ఇంజనీర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు ఉన్నారు.

ప్రాణాంతక వ్యాప్తి నుండి నిరోధించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వ్యూహాన్‌ నుంచి వచ్చిన భారతీయులను ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే వారికి తొలుత వైద్య పరీక్షలు నిర్వహించారు.. అనంతరం వారిని మనేసర్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో తరలించారు.. అక్కడే వారిని 14 రోజుల పాటు వైద్యుల అబ్జర్వేష‌న్‌లో పెట్టనున్నారు. ఎవరికైనా వైరస్‌ సోకిందన్న అనుమానం కలిగితే వారిని కంటోన్మెంట్‌ బేస్ హాస్పిటల్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తలించి చికిత్స అందిస్తారు.

వూహాన్‌ నుంచి భారతీయులను తిసుకువచ్చేందుకు ఎయిర్‌ ఇండియా విమానంలో కేంద్ర ఆరోగ్యశాఖ‌కు చెందిన‌ అయిదు మంది డాక్టర్లును అందుబాటులో ఉంచారు. ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకునేందుకు ప్రయాణంలో కొన్ని అంక్షలు విధించారు. విమానంలో ఎటువంటి స‌ర్వీస్ అందుబాటులో ఉంచలేదు. సీ ప్యాకెట్ల రూపంలో ఆహారం మాత్రమే అందుబాటులో ఉంచారు. అటు క్యాబిన్ క్రూ, ప్రయాణికుల మ‌ధ్య ఎటువంటి ఇంట‌రాక్షన్ లేకుండా చర్యలు తీసుకున్నారు.. మాస్క్‌ల‌ను కూడా విమానంలో అందుబాటులో ఉంచారు. వూహాన్‌లో మిగిలిపోయిన మరికొంత మంది భారతీయులను తీసుకువచ్చేందుకు ఇవాళ మరో విమానాన్ని పంపనున్నారు.

అటు కరోనా వైరస్‌తో చైనాలో మృతుల సంఖ్య 259కి చేరింది. మరో 11వేల 9791 మందికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరిలో 1795 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story