బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోన్న ‘అశ్వథ్థామ’..

బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోన్న ‘అశ్వథ్థామ’..
X

హ్యాండ్సమ్ స్టార్ నాగశౌర్య హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. శౌర్య మొదటి నుంచి చెబుతున్నట్టుగానే ఇది కంప్లీట్ గా ఓ డిఫరెంట్ స్టోరీ. ఇలాంటి కథ ఇప్పటి వరకూ తెలుగు సినిమా పై చూడలేదు మనం. కాస్త సస్పెన్స్, కాస్త థ్రిల్లర్.. ఇంకాస్త ఎగ్జైట్మెంట్ కలిపి.. రొటీన్ అంశాలకు భిన్నమైన కథనంతో కట్టిపడేస్తోందీ సినిమా. సిస్టర్ సెంటిమెంట్ తో మొదలైనా.. సోషల్ ఎలిమెంట్స్ ను ఇన్ బిల్ట్ చేస్తూ.. శౌర్య రాసుకున్న కథకు దర్శకుడు వందశాతం న్యాయం చేశాడనే చెప్పాలి.

ఇక అటు లవ్ స్టోరీ విషయంలో కూడా ఎక్కువ సాగదీయకుండా సింపుల్ గా, నేచురల్ గా వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకోవడం కూడా సినిమాకు కలిసొచ్చింది. ముఖ్యంగా నాగశౌర్యకు ఇది కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అతను ఘనా పాత్రలోకి ఒదిగిపోయాడు. క్యారెక్టర్ గా బిహేవ్ చేశాడు. క్యారెక్టర్ లోనే ఉండిపోయాడు. అది సినిమాకు మరింత రియాలిటీని తెచ్చింది. అలాగే విలన్ పాత్రలో నటించిన బెంగాలీ నటుడు అశ్వథ్థామకు హైలెట్ గా నిలిచాడు. అతని నటన చాలాసార్లు భయపెడుతుంది కూడా.

ఇక జిబ్రన్ నేపథ్య సంగీతం సింప్లీ సూపర్బ్. కొన్ని క్రూసియల్ సీన్స్ లో అతని నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్టుగా ఉంది. పాటలు తక్కువే అయినా అవి తెరపై మరింత బావున్నాయి.

మొత్తంగా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా అద్భుతం అనిపించుకుంటోంది. నాగశౌర్యకు ఇదే ఇప్పటి వరకూ వచ్చిన బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. అటు మౌత్ టాక్ కూడా చాలా బావుండటంతో కమర్షిల్ గా అశ్వథ్థామ ఈజీగా లాభాల్లోకి వెళుతుంది అంటున్నారు. విశేషం ఏంటంటే.. ఇక్కడే కాదు.. ఓవర్శీస్ లో సైతం అశ్వథ్థామకు అద్భుతమైన టాక్ ఉంది. మరి ఈ విజయం ఏ రేంజ్ లో ఉండబోతోంది అనేది చూడాలి.

Next Story

RELATED STORIES