టీఎస్‌ బిపాస్‌ కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది : కేటీఆర్

టీఎస్‌ బిపాస్‌ కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది : కేటీఆర్
X

టీఎస్‌ ఐపాస్‌ లాగే భవన నిర్మాణ అనుమతుల కోసం త్వరలోనే టీఎస్‌ బీపాస్‌ తీసుకువస్తున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్‌. టీఎస్‌ బిపాస్‌ కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో 2020ను ఆయన ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల అస్థిరత ఉన్నా.. తెలంగాణలో స్థిరమైన రాజకీయ వ్యవస్థ ఉందన్నారు. నాలుగేళ్ల క్రితమే బిల్డర్ల సమస్యలన్నీ సీఎం కేసీఆర్‌ పరిష్కరించారన్నారు. కార్యదక్షత, సమర్థత, విజన్‌ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్‌ మనకు లభించడం తెలంగాణ చేసుకున్న అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్‌ కృషి వల్లే హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందన్నారు.

Tags

Next Story