కొత్త సంప్రదాయానికి తెర తీసిన కేంద్ర ఆర్థికమంత్రి

కొత్త సంప్రదాయానికి తెర తీసిన కేంద్ర ఆర్థికమంత్రి

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెండోసారి కూడా ఆమె బ్రీఫ్ కేస్ తీసుకు రాలేదు. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ బుక్‌ను సీల్ చేసి పట్టుకొచ్చారు. గతంలో ఆర్థి కమంత్రులు బడ్జెట్ సమయంలో బ్రీఫ్‌కేసుతో వచ్చేవారు. ఆ విధానానికి మోదీ సర్కారు మంగళం పాడేసింది. కొత్త సంప్రదాయానికి తెర తీసింది. అందులో భాగంగా బడ్జెట్‌ బుక్‌ను ఎర్రటి వస్త్రంలో చు ట్టి తీసుకురావడం మొదలుపెట్టారు. మోదీ 2.0లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు అందుకున్న నిర్మల... తొలిసారిగా ఎర్రటి సంచితో పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ ఎర్రటి సంచీపై బంగారు రంగులో జాతీయ చిహ్నం ఉంటుంది. ఆ ముద్రకే తాళం చెవితో బ్యాగును తెరిచే వీలుంటుంది.

కేంద్ర బడ్జెట్‌ను రెండోసారి ప్రవేశపెట్టిన తొలి మహిళగా నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సాధించారు. నిర్మల బడ్జెట్ ప్రసంగాన్ని వినడానికి ఆమె కుటుంబసభ్యులు కూడా పార్లమెంట్‌కు వచ్చారు. నిర్మల కుమార్తె వాంగ్మయి తదితరులు గ్యాలరీలో కూర్చొని నిర్మల ప్రసంగాన్ని విన్నారు.

ఇక, బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రత్యేక పూజలు చేశారు. తన నివాసంలో దేవుడి విగ్రహం వద్ద పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నిర్మల, ఠాకూర్‌లు రాష్ట్రపతి కోవింద్‌ను కలిశారు.

Tags

Read MoreRead Less
Next Story