మరో 6 దేశాలను 'ట్రావెల్ బ్యాన్' లో చేర్చిన ట్రంప్

మరో 6 దేశాలను ట్రావెల్ బ్యాన్ లో చేర్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను అధికారంలోకి వచ్చిన మొదట్లో తెచ్చిన వివాదాస్పద ట్రావెల్ బ్యాన్ లో మరో ఆరు దేశాలను చేర్చారు. వాటిలో ఎరిట్రియా, కిర్గిజ్స్తాన్, మయన్మార్ మరియు నైజీరియా దేశస్థులకు విదేశీ వీసాలు ఇవ్వడాన్ని నిషేధిస్తున్నట్టు డిపార్ట్మెంట్ అఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.. అంతేకాదు సుడానీస్ మరియు టాంజానియా జాతీయులపై అదనపు ఆంక్షలు విధించనున్నట్లు పేర్కొంది. అయితే ఈ కొత్త ఆంక్షలు పర్యాటకులకు, వ్యాపార ప్రయాణాలకు వర్తించవని వైట్ హౌస్ తెలిపింది. కేవలం యుఎస్‌లో నివసించాలనుకునే వలసదారులకు జారీ చేసే వీసాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story