బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేలా ఉంది: నరేంద్రమోదీ

X
TV5 Telugu1 Feb 2020 7:43 PM GMT
బడ్జెట్‌లో అన్ని రంగాలకు న్యాయం జరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేలా కేటాయింపులు చేశామన్నారు. గ్రామీణ, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ద్వారా..యవతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. నీలి విప్లవంతో మత్స్య పరిశ్రమలో విస్తృత అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. దేశ ఆరోగ్య రంగానికి ఆయుష్మాన్ భారత్ కొత్త దశను నిర్దేశిస్తుందని.. ఇది మధ్యతరగతి, కార్పొరేట్ రంగానికి అనుకూల బడ్జెట్ అని కొనియాడారు ప్రధాని మోదీ.
Next Story