ఎస్‌బీఐ గ్రీన్ కార్ లోన్.. లక్షకు రూ.1468 చెల్లిస్తే..

ఎస్‌బీఐ గ్రీన్ కార్ లోన్.. లక్షకు రూ.1468 చెల్లిస్తే..

కారు కొనుక్కోవడం మీ కల అయితే అది ఎస్‌బీఐ తీర్చేస్తుంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కార్ లోన్స్ అందిస్తోంది. తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. ఇందుకోసం బ్యాంక్ ప్రత్యేక స్కీమ్‌ను ఏర్పాటు చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుకు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్ చేస్తున్న కార్ లోన్స్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ కారు కొనుగోలుకు తీసుకునే రుణంపై వడ్డీ రేటులో 20 బేసిస్ పాయింట్ల తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అంటే ఇతర కార్ లోన్స్ కన్నా 0.2 శాతం తక్కువ వడ్డీకే లోన్ వస్తుంది.

సాధారణంగా బ్యాంకులు కారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తాయి. కానీ గ్రీన్ కార్ లోన్ తీసుకుంటే మాత్రం ఎస్‌బీఐ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయదు. అయితే స్కీమ్ లాంచ్ అయిన తొలి ఆరు నెలలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 21-67 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వారు ఈ కార్ లోన్ తీసుకోవచ్చు. కారు ధరను బట్టి 90 శాతం వరకు బ్యాంక్ నుంచి రుణం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం ఉపాది పొందుతున్న వారు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే ఉద్యోగులకు నికర వార్షిక ఆదాయం కనీసం రూ.3 లక్షలు ఉండాలి. ఎస్‌బీఐ గ్రీన్ కార్ లోన్ కోసం బ్యాంక్‌కు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. https://onlineapply.sbi.co.in/personal-banking/auto-loan? లక్షకు రూ.1468 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. 96 నెలల కాల పరిమితిలోని రుణానికి ఇది వర్తిస్తుంది. అదే మీరు 84 నెలల కాల పరిమితితో రుణం తీసుకుంటే అప్పుడు ఈఎంఐ రూ.1,622గా ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story