టెక్సాస్‌లో మరోసారి కాల్పుల కలకలం

టెక్సాస్‌లో మరోసారి కాల్పుల కలకలం
X

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్‌లోని Aఅండ్M యూనివర్సిటీలో ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వారు విద్యార్థులా.. వేరేవాళ్లా.. అన్నది తెలియాల్సి ఉంది. మరో చిన్నారికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. తుపాకీ లైసెన్స్ కలిగిన వ్యక్తే.. వర్సిటీలో కాల్పులు జరిపినట్టు పోలీసులు భావిస్తున్నారు

టెక్సాస్‌లోని Aఅండ్M యూనివర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. అక్కడ 16 వందల మంది భారతీయ విద్యార్థులు సైతం ఉన్నారు. కాల్పుల కలకలం రేగడంతో వర్సిటీ యాజమాన్యం అప్రమత్తం అయింది. విద్యార్థులు, అధ్యాపకులు.. ఎవరి గదిలో వాళ్లు ఉండాలని సూచించింది. ఎవ్వరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది.

Tags

Next Story