Top

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు సమన్లు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు సమన్లు
X

తమిళనాడులోని తూత్తుకుడి ఘటనపై సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసు విచారణకు మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్‌ జగదీశన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్‌.. సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న తన ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గత ఏడాది తూత్తుకుడి రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనల్లో భాగంగా పోలీసుల కాల్పుల్లో 13 మంది చనిపోయారు. అనంతరం బాధితుల్ని ఆసుపత్రిలో పరామర్శించిన రజనీకాంత్‌.. కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడం వల్లే పోలీసులు కాల్పులు జరిపారన్నారు. ఇది అప్పట్లో పెద్ద వివాదమైంది. దీనిపై వివరాణ కోరగా.. చెప్పేందుకు రజనీ నిరాకరించారు. అయితే.. తనకు అన్నీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. తాజాగా రజనీకి సమన్లు జారీ కావడంతో.. ఆయన వ్యాఖ్యలపై కమిషన్‌ వివరణ కోరే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు 379 మందిని కమిషన్‌ ప్రశ్నించింది.

Next Story

RELATED STORIES