'జానూ'ని ఎంత మంది ప్రేమిస్తారు?

జానూని ఎంత మంది ప్రేమిస్తారు?
X

రీమేక్ చిత్రాలు తీయాలంటే చాలా ధైర్యం కావాలి. అందునా సూపర్ డూపర్ హిట్టైన సినిమా తీయాలంటే నిర్మాతతో పాటు ఆ చిత్రంలో నటించే నటీనటులకు కత్తి మీద సాము లాంటిదే. దాదాపుగా తమిళ సినిమాలన్నీ తెలుగు ప్రజలు చూస్తుంటారు. ఆ సినిమాపై ఒక అభిప్రాయానికి వచ్చేస్తుంటారు. అందులో 96 లాంటి మూవీని చూడకుండా ఎలా ఉంటారు. మరి అదే సినిమాని జాను పేరుతో తెలుగులో తీస్తే.. దిల్ రాజు నిర్మాతగా, సమంత, శర్వానంద్ హీరోహీరోయిన్లుగా నటిస్తే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకీ బ్రహ్మరథం పడతారని ఆశిస్తోంది చిత్ర యూనిట్. నటీనటులు వాళ్ల ఎఫర్ట్స్ వంద శాతం పెట్టి చేసినా సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుందంటే ఒకరకమైన టెన్షన్ మొదలవుతుంది. ఇప్పుడు అదే ఫీల్‌తో ఉన్నారు దిల్ రాజు అండ్ కో.. ప్రతి పాత్రని ఓన్ చేసుకుని నటించే సమంత, శర్వానంద్‌లు వారి పాత్రలకు న్యాయం చేసారనే చెప్పాలి. ఈ పాటికే రిలీజైన టీజర్ ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది. జాను ఈనెల 7న వస్తోంది. తెలుగు ప్రేక్షకులూ ఈ చిత్రాన్ని ప్రేమించేస్తారు.

Next Story

RELATED STORIES