రామమందిరం నిర్మాణంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన

రామమందిరం నిర్మాణంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన
X

అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై.. ప్రధాని మోదీ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు మందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుడి నిర్మాణాన్ని శ్రీ రామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. నిర్మాణ పనులకు సంబంధించి ట్రస్ట్‌ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌కు 5 ఎకరాల భూమి ఇచ్చేందుకు యూపీ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు మోదీ.

Next Story

RELATED STORIES