ఘనంగా టీ పాడ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

ఘనంగా టీ పాడ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

డాలస్ తెలంగాణ ప్రజాసమితి టీ-పాడ్ నూతన కమిటీని ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఫ్రిస్కో నగరంలో సమావేశమైన సంస్థ ప్రతినిధులు, 2020 కమిటీని ఎన్నుకున్నారు. టీ-పాడ్ అధ్యక్షులుగా రవి కాంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రూపా కన్నయ్య నియమితులయ్యారు. ఈ సందర్బంగా అధ్యక్ష కార్యదర్శులతోపాటు వివిధ కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సంవత్సరం టీపాడ్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి తెలుగు ప్రాంతీయ, జాతీయ సంస్థల నాయకులు పాల్గొని, నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు.

Tags

Read MoreRead Less
Next Story