క్రైమ్

కామాంధుడికి జైలుశిక్ష

కామాంధుడికి జైలుశిక్ష
X

మైనర్‌ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారయత్నం చేసిన కామాంధుడికి జైలుశిక్ష పడింది. శంషాబాద్‌ మండలం పెద్దగోల్కొండకు చెందిన 30 ఏళ్ల చర్లబావి రవి.. 2018 మార్చి 8న చిత్తు కాగితాలు ఏరుకునే అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అరెస్టు చేశారు. డీసీపీ ప్రకాష్‌రెడ్డి పర్యవేక్షణలో.. ఎల్బీనగర్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో రవికి ఏడాది జైలుశిక్ష.. 2వేలు జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

Next Story

RELATED STORIES