అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : వైసీపీ ఎమ్మెల్యే

X
TV5 Telugu6 Feb 2020 3:27 PM GMT
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని తన కార్యాలయం ఎదుట ముస్లిం సంఘాల నేతలు నిలదీశారు. NRCకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ రూరల్ కార్యాలయాన్ని పెద్దసంఖ్యలో చుట్టుముట్టారు. వారిని సముదాయించిన ఎమ్మెల్యో కోటంరెడ్డి.. NRCని తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని చెప్పారు. అవసరమైతే.. NRCకి వ్యతిరేకంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సైతం వెనుకాడనని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టంచేశారు.
Next Story