Top

ఆస్తుల కేసులో జగన్‌కు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ

ఆస్తుల కేసులో జగన్‌కు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ
X

ప్రతి శుక్రవారం కోర్టునుంచి సీఎం జగన్‌కు మినహాయింపుపై ఉత్కంఠ నెలకొంది. గురువారం తెలంగాణ హైకోర్టులో జగన్‌కు మినహాయింపుపై కీలక విచారణ జరగనుంది. CBI, ED కేసుల్లో విచారణకు వ్యక్తిగత హాజరు మిహాయింపు ఇవ్వాలంటూ ఇటీవల హైకోర్టులో సీఎం జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎం హోదాలో ఉన్న తనకు ప్రతి శుక్రవారం హాజరు కావడం సాధ్యం కాదని జగన్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. CBI కోర్టు నిరాకరించడంపై హైకోర్టులో విడిగా పిటిషన్లు వేశారు. దీంతో CBI, ED రెండూ కేసులపై విచారిస్తామని హైకోర్టు చెప్పింది.. దీంతో ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది..

Next Story

RELATED STORIES