యువతిపై తల్లిదండ్రులు, అన్న దాడి

X
TV5 Telugu7 Feb 2020 11:49 AM GMT
నల్గొండ జిల్లా మునుగోడు మండలం వెలగలగూడెంలో దారుణమైన ఘటన జరిగింది. ఆస్తి విషయంలో వివాదాలతో యువతిపై తల్లిదండ్రులు, అన్న దాడి చేశారు. ఇది చూసిన గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. గాయాల పాలైన కవితను ఆస్పత్రికి తరలించారు. కొన్నేళ్లుగా కవితకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉన్నంతలో కట్నం ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ కవిత అందుకు ఒప్పుకోలేదు. తన ఆస్తి తనకు ఇప్పించాలంటూ ఎస్పీ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసింది. కొన్నాళ్లుగా దీనిపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఆస్తి గొడవల్లో భాగంగా కవితపై మిగతా కుటుంబ సభ్యులు దాడి చేశారు.
Next Story