నకిలి 'కరోనా' వైరల్..

గత కొద్దీ రోజులుగా చైనాతోపాటు ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా వైరస్ పై ఫేక్ ప్రచారం ఎక్కువైంది. కరోనా వైరస్ ప్రభావంతో చైనాలో ఇప్పటికే 600 వందలకు పైగా మరణించారు. ఇదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో కరోనా వైరస్ పై ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజల్ని మరింతగా భయపెడుతున్నారు కొందరు ఆకతాయిలు.. ‘భారత్‌లోకి కూడా ప్రవేశించిన చైనాలోని కరోనా వైరస్ పర్యవసానం ఇదీ’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో రోడ్డుమీద వందలమంది చనిపోయినట్లు కనిపిస్తోంది. దాంతో ఆ ఫోటో చూసిన నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు.
అయితే ఇందులో ఆందోళన చెందాల్సిన పని లేదు ఆ ఫోటో ఫేక్ అని తేలింది. వాస్తవానికి 1945, మార్చి 24వ తేదీన ‘కట్చ్‌బాగ్’ నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో మరణించిన 528 ప్రజల సంస్మరణార్థం.. 2014 మార్చి 24వ తేదీన జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో కళాకారుల బృందం చేసిన ప్రదర్శన ఇది. అప్పట్లో ఈ ప్రదర్శనకు మంచి పేరు తోపాటు అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ ఫోటోను పట్టుకొని కరోనా వైరస్ కారణంగా జనం పిట్టల్లా రాలిపోతున్నారంటూ ఫేక్ ప్రచారానికి తెరతీశారు. అయితే అవాస్తవం అని తేలింది. మరోవైపు సోషల్ మీడియాలో ఇటువంటి నకిలీ ఫొటోలను కనుక్కోవడానికి ‘యాండెక్స్’ అనే యాప్ అందుబాటులోకి ఉంది. దీని ద్వారా ఫోటో నకిలీదో, అసలుదో కనిపెట్టవచ్చు.
RELATED STORIES
Petrol And Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించిన...
23 May 2022 2:15 PM GMTKCR: ప్రాణం పోయినా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టను: కేసీఆర్
22 May 2022 4:15 PM GMTNarendra Modi: థామస్ కప్ అండ్ ఉబెర్ కప్ విజేతలతో మోదీ ఇంటరాక్షన్..
22 May 2022 10:10 AM GMTFuel And Gas Rates: దేశ ప్రజలకు శుభవార్త.. చమురు, గ్యాస్ ధరలపై...
21 May 2022 2:45 PM GMTKCR: భవిష్యత్తులో ఆ సంచలనాన్ని చూడబోతున్నారు- సీఎం కేసీఆర్
21 May 2022 2:01 PM GMTAssam: వరద బీభత్సం.. ఇళ్లు కోల్పోయి రైల్వే ట్రాక్‌పై 500 కుటుంబాలు..
21 May 2022 11:37 AM GMT