తాజా వార్తలు

ఇద్దరు విద్యార్ధులపైకి దూసుకెళ్లిన లారీ

ఇద్దరు విద్యార్ధులపైకి దూసుకెళ్లిన లారీ
X

హైదరాబాద్‌లో లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ విద్యార్ధి మృతిచెందాడు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వద్ద కాలేజీకి వెళ్తుండగా గుంటి అజయ్‌, గుంటి రవిలను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు కరీంనగర్‌ జిల్లా కొండగట్టుకు చెందిన వారిగా గుర్తించారు. వీరు రామ్‌నగర్‌లోని పయనీర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంగ్‌ కాలేజ్‌లో చదువుతున్నారు.

Next Story

RELATED STORIES