దీక్షలు, ధర్నాలతో హోరెత్తుతున్న అమరావతి

రాజధాని రైతుల దీక్షలతో అమరావతి హోరెత్తుతోంది. 52వ రోజూ రైతులు, మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతులది త్యాగం కాదా..? అంటూ నిలదీశారు. అమరావతిని చంపి విశాఖను అభివృద్ధి చేయడం ఎందుకంటూ ప్రశ్నించారు. మందడం, తుళ్లూరులో మహాధర్నా, వెలగపూడిలో రీలే దీక్షలు కొనసాగాయి. వెలగపూడిలో యువకులు 151 గంటల దీక్షకు దిగారు. పలు గ్రామాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు వీరికి
రాయపూడి వద్ద కృష్ణానదిలో వెలగపూడి గ్రామస్థులు జలదీక్ష చేశారు. జగన్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశారు.
రాయపూడిలో రైతులు,మహిళలు సర్వమత ప్రార్ధనలు చేశారు. కడప, గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లింలు రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్ ఫిలిం చాంబర్ ముందు శనివారం విద్యార్ధి యువజన జేఏసీ నేతల ఆందోళన నిర్వహించనున్నారు. 52 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా... సినీ ఇండస్ట్రీ ఏ మాత్రం స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి సినీ పరిశ్రమ మద్దతు తెలిపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
గుంటూరులో స్వరూపానందేంద్ర స్వామికి అమరాతి సెగ తగిలింది. గోరంట్లలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చిన స్వరూపానందేంద్రను స్థానిక మహిళాభక్తులు నిలదీశారు. అమరావతికి మద్దతు తెలపాలంటూ కోరారు. జై అమరావతి అంటూ స్వరూపానందేంద్ర వాహనం చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఇది చూసి వైసీపీ నేతలకు ఆగ్రహం వచ్చేసింది. స్వామీజీని ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హడావుడిగా ఆయన్ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
పలువురు అమరావతి మహిళలు, రైతులు మేడారం తరలివెళ్లారు. రాజధానిగా అమరావతే కొనసాగేలా చూడాలంటూ శనివారం వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com