రికార్డు సృష్టించిన క్రిస్టినో కోచ్

రికార్డు సృష్టించిన క్రిస్టినో కోచ్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సుదీర్ఘకాలం గడిపిన వ్యక్తిగా క్రిస్టినో కోచ్‌ రికార్డు సృష్టించారు. ఆమె 328 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆమె భూమిని చేరుకున్నారు. ఆమెతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన లూకా పర్మిటానో, రష్యాకు చెందిన అలెగ్జాండర్ ష్కోవ్రోట్సవ్‌ కూడా ఉన్నారు. సోయెజ్ క్యాప్సూల్‌లో వారంతా కజకిస్థాన్‌లో ల్యాండయ్యారు. ల్యాండింగ్ సమయంలో క్రిస్టినో కోచ్ నవ్వుతూ కనిపించారు. యూరోపియన్ వ్యోమగామి పర్మిటానో పిడికిలి పైకెత్తి ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

క్రిస్టినో కోచ్ అమెరికాలోని మిషిగన్‌లో జన్మించారు. 2019 మార్చ్ 14న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లోకి వెళ్లారు. 2020 ఫిబ్రవరి 6వ తేదీన మళ్లీ భూమిపైకి వచ్చారు. అంతరిక్షంలో దాదాపు 328 రో జులు గడిపారు. దాంతో మరో మహిళా వ్యోమగామి పెగ్గి విట్సన్‌ పేరుతో ఉన్న రికార్డును అధిగమించారు. పెగ్గీ విట్సన్‌ 2016-17లో 289 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. పెగ్గీ కంటే కోచ్ దాదాపు 40 రోజులు ఎక్కువగా ఐఎస్‌ఎస్‌లో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story