Top

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట విషాదం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట విషాదం
X

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట విషాదం నెలకొంది. కేసీఆర్‌ రెండో సోదరి భర్త పర్వతనేని రాజేశ్వర్‌ రావు (84) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఓల్డ్‌ అల్వాల్‌ మంగాపురిలో రాజేశ్వరరావు పార్థీవ దేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు. ఇక మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు ఓల్డ్‌ ఆల్వాల్‌ చేరుకుని నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా పర్వతనేని రాజేశ్వరరావు స్వస్థలం.. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్ల.

Next Story

RELATED STORIES