చివరి అంకానికి చేరుకున్న మేడారం జాతర

X
By - TV5 Telugu |8 Feb 2020 7:02 PM IST
అంగరంగ వైభవంగా సాగుతున్న మేడారం జాతర శనివారం ముగియనుంది. రాత్రికి దేవతల వన ప్రవేశం చేయనున్నారు. దీంతో మహాక్రతువు ముగియనుంది .ఇందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. శనివారం జాతరకు ఆఖరి రోజు కావడంతో భక్తుల సంఖ్య రెట్టింపైంది. దారులన్నీ మేడారం వైపు సాగాయి. తల్లులను దర్శించుకునేందుకు తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
కుంభమేళాను తలపించే విధంగా మేడారం పరిసర ప్రాంతాలు మారిపోయాయి. ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. ఇప్పటికే 1.20 కోట్ల మంది వన దేవతల్ని దర్శించుకున్నారు. అక్కడే నాలుగు రోజులుగా ఉండి.. అమ్మవార్లను కొలుస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. బెల్లాన్ని బంగారంగా భావిస్తూ నిలువెత్తున సమర్పిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com