సవారితో మళ్లీ బోల్తా పడ్డ నందు

సవారితో మళ్లీ బోల్తా పడ్డ నందు
X

నందు.. నటుడుగా మారి చాలా యేళ్లైనా ఇప్పటికీ సింగర్ గీతా మాధురి భర్తగా మాత్రమే మిగిలిపోయిన కుర్రాడుగా కనిపిస్తాడు. టాలెంటెడా కాదా అని పరిశీలించే లోపే అయిపోయే పాత్రలు ఎన్నో చేశాడు. అంటే నటుడుగా నందుకు మరీ అంత స్కోప్ లేదనే సదరు చిత్రాల దర్శకుల ఆలోచన అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈ గీతా మాధురి భర్తను హీరోగా పెట్టి సవారి చేయడం అంటే చాలా పెద్ద రిస్క్. కొన్నిసార్లు రిస్క్ మంచి రిజల్ట్ ఇస్తుంది. కానీ ఈ సారి కాదు. యస్.. నందు హీరోగా వచ్చిన సవారి ట్రైలర్ తో మెప్పించినా.. సినిమాతో బోర్ కొట్టించాడు.

టాలెంట్ అంతా ట్రైలర్ కే పరిమితం అని సినిమా మొదలైన పావుగంటకే తేలిపోతుంది. బోల్డ్ స్లమ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీలో ఏ మాత్రం సహజత్వం కనిపించదు. ఎమోషనల్ సీన్స్ అన్నీ తేలిపోతాయి. ఇక స్లమ్ అబ్బాయి, రిచ్ అమ్మాయి కథలు అంటూ చాలానే వచ్చాయి. అంటే ఖచ్చితంగా కంటెంట్ డిఫరెంట్ గా ఉండేలా చూసుకోవాలి. అలాంటి ప్రయత్నాలు ఈ దర్శకుడు చేసినట్టేం కనిపించదు. ఇలాంటి ఎన్నో బలహీనతల వల్ల సవారి సరిగా సాగలేదనే చెప్పాలి.

హీరో, హీరోయిన్ల ప్రేమకథ ఏ దశలోనూ మెప్పించదు. ఏ సన్నివేశంలోనూ సహజత్వం కనిపించదు. రొమాంటిక్ డ్రామా అస్సలు పండలేదు. ఇలాంటి రిచ్ అండ్ పూర్ లవ్ స్టోరీలో ఉండాల్సిన కాన్ ఫ్లిక్ట్ పూర్తిగా మిస్ అయింది. మొత్తంగా గుర్రపుబండిపై సవారి ఇరుసు లేని చక్రంలా.. ఒక్కోసారి అసలు గుర్రమే లేని సవారిలా కనిపిస్తుంది. దీంతో నటుడుగా నందు, దర్శకుడుగా అతనూ పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి.

Next Story

RELATED STORIES