కరోనా వైరస్ : 800 కు చేరిన మృతుల సంఖ్య

కరోనా వైరస్ : 800 కు చేరిన మృతుల సంఖ్య

కరోనా వైరస్‌ పంజాతో చైనా గజ వణుకుతోంది. వైరస్ దెబ్బకు ప్రజలు టపటపా రాలిపోతున్నారు. రోజురోజుకు మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 88 మంది చనిపో యారు. ఇది ఇప్పటివరకు నమోదైన ఒక్కరోజు మరణాల్లో అత్యధికం. మొత్తమ్మీద ఇప్పటి వరకు 800 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. మరో 40 వేల మంది వైరస్ బారిన పడ్డారు. కొన్ని లక్షల మంది వైరస్ అనుమానంతో ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు. కోట్లాదిమంది ప్రజలు ఇళ్లల్లోనే బందీలుగా మారిపోయారు.

వూహాన్, హూబేలలో పరిస్థితి దారుణంగా ఉంది. వూహాన్‌లోనే కరోనా వైరస్ బయటపడింది. దాంతో అక్కడ వ్యాధి తీవ్రత అత్యధికంగా ఉంది. ఫలితంగా మరణాలు, బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. హూబేలోనూ ఇదే పరిస్థితి. దాంతో ఆ రెండు నగరాలను పూర్తిగా అధికారులు అలర్ట్‌ ప్రకటించారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. ప్రజలు ఆస్పత్రులు, ఇళ్లకే పరిమితమయ్యారు.

కేవలం చైనానే కాదు కరోనా వైరస్ ప్రపంచదేశాలను భయపెడుతోంది. వైరస్ టెన్షన్‌తో చాలా దేశాలు అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఏకంగా చైనాతో అన్ని రకాల బంధాలను తాత్కాలికంగా కట్ చేసుకుంటు న్నాయి. అలాగే, వూహాన్, హూబే నగరాల నుంచి తమ పౌరులను వెనక్కి రప్పిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఇప్పటికే వందల మందిని వెనక్కి తీసుకొచ్చింది. ఇంకా అక్కడ 80 మంది భారతీ య విద్యార్థులు ఉన్నారు. అందులో 70 మంది అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు. మిగిలిన 10 మంది వైరస్ స్క్రీనింగ్ టెస్ట్‌లో ఫెయిలయ్యారు. చైనా నుంచి భారత్‌ వచ్చిన ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహిస్తున్నారు..

చైనా సహా పొరుగు దేశాల నుంచి వస్తున్నవారికి ఎయిర్‌పోర్టులలోనే పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరి 18 నుంచి ఇప్పటివరకు లక్షా 40 వేల మందికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేశారు. చైనా నుంచి భారత్‌కు వస్తున్న విదేశీయులందరి వీసాలనూ ప్రభుత్వం రద్దు చేసింది. దేశంలో ఇప్పటిదాకా 1232 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా 1199 మందికి నెగెటివ్‌ అని తేలిందని, ముగ్గురికి పాజిటివ్‌ రాగా, మరో 30 నమూనాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story