తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న 'కరోనావైరస్' అనుమానిత కేసుల సంఖ్య

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న కరోనావైరస్ అనుమానిత కేసుల సంఖ్య
X

తెలుగు రాష్ట్రాలను కరోనా భయం వణికిస్తోంది. కరోనా అనుమానిత కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం హైదరాబాద్‌లో శనివారం 9 అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 70 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, 62 కేసుల్లో నెగటివ్‌ వచ్చింది. మరో 8 మందికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.

ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి నిన్న గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. అనుమానిత రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గాంధీలో 10 పడకల సామర్థ్యంతో అదనంగా మరో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎంఈ చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని, కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని సూచించారు.

Next Story

RELATED STORIES