బుల్లితెర కమెడియన్స్ .. సిల్వర్ స్క్రీన్ డిజాస్టర్స్ ..

బుల్లితెర కమెడియన్స్ .. సిల్వర్ స్క్రీన్ డిజాస్టర్స్ ..

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యారు. ఆటో పంచులు, అప్పుడప్పుడూ దిగువ స్థాయి కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన త్రయం సుధీర్, శ్రీను, రాం ప్రసాద్. వారి ప్రతిభకు బుల్లితెర వరకూ ఆనందించిందేమో. కానీ వెండితెరపైనా అదే స్థాయిలో ఆకట్టుకోవాలంటే కావాల్సింది కంటెంట్.. అలాగే ఆ స్థాయికి తగ్గ ప్రతిభ. ఈ రెండూ మిస్ అయిన సినిమా త్రీ మంకీస్. రొటీన్ పంచులు.. రిపీటెడ్ గా అనిపించే సన్నివేశాలు.. పైగా ఆ పాత్రల స్థాయికి తగ్గట్టుగా ఈ ముగ్గురు నటులు కనిపించరు.

ఓ సాధారణ కథతో బుల్లితెరపై కాస్త ఫేమ్ అయిన ఈ ముగ్గురితో కథనం నడిపించొచ్చు అనుకున్నాడేమో దర్శకుడు. కానీ సినిమాకు ఆర్టిస్టుల ఫేమ్ కంటే కూడా కంటెంటే ఇంపార్టెంట్. కథ కాస్త అటూ ఇటైనా.. మంచి కథనం లేకుంటే ఖచ్చితంగా బోరింగ్ అనిపిస్తుంది. ఈ మూవీలో ఆ బోరింగ్ లక్షణాలు బోలెడు ఉన్నాయి. ఏ దశలోనూ త్రీ మంకీస్ ఆకట్టుకోలేరు. పైగా ప్రతి సన్నివేశం పదినిమిషాల క్రితమే కదా చూశాం అనిపించేలా అత్యంత బలహీనమైన కథనంతో వీలైనంత విసిగించారీ మంకీస్.

పదినిమిషాల స్కిట్ తో ఆకట్టుకున్నట్టు కాదు .. సినిమాతో మెప్పించడం అంటే. వచ్చిన ఫేమ్ ను క్యారెక్టర్స్ కు వాడుకుంటే ఫర్వాలేదు కానీ.. ఏకంగా హీరోలుగా అంటే స్టేచర్ కూడా ఇంపార్టెంటే కదా. కానీ ఈ ముగ్గురిలో అది పూర్తిగా మిస్ అయింది. పైగా ఇక్కడ కూడా జబర్దస్త్ టైప్ చీప్ పంచులే వేయాలనుకోవడం వారి స్థాయి అక్కడికే పరిమితం అనేది డిక్లేర్ చేస్తుంది. ఈ ఇద్దరిలో గెటప్ శ్రీను నటన జబర్దస్త్ లో కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. కానీ సిల్వర్ స్క్రీన్ పై మనోడు సీన్స్ కు తప్ప సినిమా అంతా పనికిరాడు అని తేలిపోయింది. ఇక ఆటో రాంప్రసాద్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సుధీర్ బుల్లితెరపైనే తనో స్టార్ అని ఫీలవుతాడు. కానీ తనకు అంత లేదు అని రీసెంట్ గా వచ్చిన సినిమా చూపించింది.. ఈ సినిమా డిక్లేర్ చేసింది. మొత్తంగా త్రీ మంకీస్ అంటూ వచ్చిన ఈ బ్యాచ్ లో ఏ మంకీ కూడా మెప్పించలేదు. బలహీనమైన కథ, కథనం, పాత్రలతో పర్ఫెక్ట్ గా బోర్ కొట్టించారనే చెప్పాలి.

Tags

Read MoreRead Less
Next Story