ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతా విభాగం లో సరికొత్త అంకానికి తెరతీసింది. మహిళలతో ప్రత్యేకంగా మూడు పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేసింది. తొలి బెటాలియన్ గోరఖ్‌పూర్‌లో ఏర్పాటైంది. లక్నో, బదౌనీ నగరాల్లో మరో రెండు మహిళా బెటాలియన్లను ఏర్పాటు చేయనున్నారు. మహిళల రక్షణ కోసమే ఈ స్పెషల్ టీంలు పని చేస్తాయని సీఎం యోగి ఆదిత్యానాధ్ తెలిపారు.

యూపీలో అధికారంలోకి వచ్చినప్పటికీ యోగి ఆదిత్యానాధ్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈవ్ టీజర్ల భరతం పట్టడానికి స్పెషల్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. రోమియో స్క్వాడ్లతో ఈవ్ టీజర్ల తాట తీశారు. రౌడీలు, గూండాలు, సంఘ విద్రోహశక్తులపైనా ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు మహిళల రక్షణ కోసం ఏకంగా ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story