హైకోర్టులో ఏడు పిటిషన్లు దాఖలు చేసిన అమరావతి రైతులు.. విచారణ వాయిదా

హైకోర్టులో ఏడు పిటిషన్లు దాఖలు చేసిన అమరావతి రైతులు.. విచారణ వాయిదా

హైకోర్టులో అమరావతి రైతులు ఏడు పిటిషన్లు దాఖలు చేశారు. భూసమీకరణ కింద భూములు తీసుకుని మూడేళ్లలో అభివృద్ధి చేసి ఇవ్వలేదని పిటిషన్లు వేశారు. చివరి ల్యాండ్‌ పూలింగ్ నుంచి మూడేళ్లలో మౌలిక వసతులు కల్పిస్తామని CRDA చట్టంలో ఉందని.. అభివృద్ధి చేసిన స్థలాలు అప్పగించకపోవడంతో రైతులు జీవనోపాధి కోల్పోతున్నారని పిటిషనర్‌ తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. రెసిడెన్షియల్‌ ప్లాట్‌కు ప్రతినెలా చదరపు గజానికి 30 రూపాయలు పరిహారం కోరుతుండగా.. కమర్షియల్ ప్లాట్‌కు ప్రతినెలా చదరపు గజానికి 50 రూపాయలు పరిహారం చెల్లించాలని రైతులు కోరారు.. ఏడు పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని CRDAను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story