ఆటో ఎక్స్‌పో-2020లో గందరగోళం

ఆటో ఎక్స్‌పో-2020లో గందరగోళం

ఢిల్లీలో ఆటో ఎక్స్‌పో-2020లో గందరగోళం చెలరేగింది. సందర్శకులు భారీగా రావడం, నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం ఘర్షణకు దారి తీసింది. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆటో షోను చూడడానికి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న విజిటర్స్, సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రింటవుట్ లేకుండా వచ్చిన సందర్శకులను నిర్వాహకులు అడ్డుకున్నారు. దీంతో వారంతా ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిర్వాహకులతో గొడవకు దిగారు. ఈ నేపధ్యంలో అక్కడున్న బౌన్సర్లు సందర్శకులపై దాడికి దిగారు. ఈ వివాదంపై మేనేజ్‌మెంట్ స్పందించింది. ఆన్‌లైన్‌‌లో టిక్కెట్ తీసుకున్నప్పుడు క్యూఆర్ కోడ్ వస్తుందని, దానిని సందర్శకులు ఎంట్రీ టిక్కెట్ అనుకుంటున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్ చూపించి టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అప్పుడే వారికి ఎంట్రీ లభిస్తుందని వివరించారు.

ఆటో ఎక్స్‌పోను చూడడానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సారి విజిటర్స్ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఏకంగా లక్ష మందికి పైగా సందర్శకులు వచ్చారు. అంతమంది వస్తారని అంచనా వేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. విజిటర్స్‌కు తగినట్లుగా ఏర్పాట్లు చేయలేకపోయారు. దాంతో లోపలికి ఎలా వెళ్లాలో, ఎక్కడేమున్నాయో అర్ధంగాక సందర్శకులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. దాంతో నిర్వాహకులు, విజిటర్స్ మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా ముదిరి తోపులాటకు దారి తీసింది.

Tags

Read MoreRead Less
Next Story