సీఎం కేజ్రీవాల్‌ హ్యాట్రిక్‌..

సీఎం కేజ్రీవాల్‌ హ్యాట్రిక్‌..
X

సీఎం కేజ్రీవాల్‌ హ్యాట్రిక్‌ కొట్టారు.. ముఖ్యమంత్రిగా మూడోసారి బాధ్యతల చేపట్టనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల లెక్కింపు ప్రారంభం నుంచి ఆప్‌ దూకుడు చూపిస్తోంది. మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాలకుగాను ఆప్‌ దాదాపు 50 స్థానాల్లో గెలుపు సాధించేలా కనిపిస్తోంది. బీజేపీ 20కు పైగా స్థానాలు నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌, ద్వారాకా, జనక్‌ పురి, కృష్ణానగర్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

మ్యాజిక్ ఫిగర్ 36 కాగా ఇప్పటికే 50 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. ఇక ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి పరాభవం ఎదురైంది. ఆప్‌కు గట్టి పోటీ ఇవ్వకపోయినా.. అక్కడక్కడ బీజేపీ ముందంజలో ఉంది. 2015 ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ బాగా మెరుగుపడింది. 2015లో ఆప్‌ 67, బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు బీజేపీ దాదాపు 20 స్థానాలకుపైగా గెలుచుకునే పరిస్థితి కనిపిస్తోంది. రోహిణిలో బీజేపీ అభ్యర్థి విజయేంద్రకుమార్‌ లీడ్‌లో కొనసాగుతున్నారు. బగ్గాలో తాజిందర్‌పాల్‌ సింగ్‌ ఆప్‌ అభ్యర్థిని వెనక్కినెట్టి ముందంజలో కొనసాగుతున్నారు.

Next Story

RELATED STORIES