కోర్టులో బాంబు పేలుడు.. లాయర్లే..

కోర్టులో బాంబు పేలుడు.. లాయర్లే..
X

లక్నో కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించింది. వజీర్‌గంజ్ సివిల్ కోర్టులో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు లాయర్లు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మరో మూడు బాంబులను గుర్తించారు. బాంబు పేలగానే కోర్టు ప్రాంగణంలో ఉన్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. లాయర్ల మధ్య గొడవలే ఈ పేలుడుకు కారణమని ప్రాథమికంగా తేల్చారు. లాయర్ సంజీవ్ లోధీ చాంబర్ వైపు బాంబును విసిరారు. ఈ పేలుడుకు మరో లాయర్ జీతూ యాదవ్ కారణమని సంజీవ్ ఆరోపించారు. ఈ పేలుడులో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పేలుడు కోసం నాటు బాంబులను ఉపయోగించినట్టు తెలుస్తోంది.

Next Story

RELATED STORIES