కరోనా పాజిటీవ్ కేసుల ప్రచారాన్ని కొట్టిపారేసిన గాంధీ ఆస్పత్రి వర్గాలు

కరోనా పాజిటీవ్ కేసుల ప్రచారాన్ని కొట్టిపారేసిన గాంధీ ఆస్పత్రి వర్గాలు

చైనాలో ప్రబలిన కరోనా ధాటికి ప్రపంచమే బెంబేలెత్తిపోతోంది. తుమ్మినా, దగ్గినా వచ్చే వ్యాపించే వైరస్ కావటంతో వేగంగా విస్తరిస్తోంది. రోజు కరోనా అప్ డేట్స్ జనం ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లు ఉన్నారనే ఊహాగానాలు కరోనా వైరస్ కంటే వేగంగా సిటీ అంతటా పాకుతోంది. దీంతో జనం భయపడిపోతున్నారు.

అయితే.. గాంధీ ఆస్పత్రి వర్గాలు మాత్రం కరోనా పాజిటీవ్ కేసుల ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలోనే కాదు.. అసలు రాష్ట్రంలోనే ఒక్క పాజిటీవ్ కేసు కూడా లేదని తేల్చి చెబుతున్నారు డాక్టర్లు. ఆ మాటకు వస్తే కేరళాలో తప్ప దేశంలోనే ఎక్కడా వైరస్ వ్యాప్తి లేదని అంటున్నారు.

కరోనా అనుమానితులకు నిర్వహించిన పరీక్షలన్ని నెగటీవ్ అనే వచ్చామని గాంధీ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు. అయినా.. కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు ఐసోలేటెడ్ వార్డు, ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ తో స్పెషల్ గా ఒక ఫ్లోర్ నే కేటాయించామని అన్నారు.

తెలంగాణలో కరోనా ఊహాగానాలు వేగంగా వ్యాపిస్తుంటే..కొనసీమలో మాత్రం హెర్సిస్ వైరస్ మూగజీవాల ఉసురు తీస్తోంది. హెర్సిస్ వైరస్ తో కలిగే లంపి స్కిన్ వ్యాధి సోకి మూగజీవాలు పిట్టాల్లా రాలిపోతున్నాయి. ముమ్మిడివరం, అమలాపురం, పి. గన్నవరం, రాజోలు, రావులపాలెం, కాట్రేనికోన, ఆలమూరు మండలాల్లో మూగజీవాలు ఈ లంపి స్కిన్ వ్యాధి బారిన పడ్డాయి. ఒడిశా నుంచి ఈ వైరస్ వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. మూగజీవాలు రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడుతుండటంతో జనం కరోనా వైరస్ అని భయపడిపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story