భారతదేశం.. రాష్ట్రాల సమాఖ్య మాత్రమే: కేటీఆర్

భారతదేశం.. రాష్ట్రాల సమాఖ్య మాత్రమే: కేటీఆర్
X

దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయపార్టీలే అన్నారు తెలంగాణ పరిశ్రమలు- ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌. ఢిల్లీలో టైమ్స్‌నౌ యాక్షన్‌ ప్లాన్‌ ట్వంట్వీ-ట్వంటీ సమిట్‌లో పాల్గొన్న కేటీఆర్‌.. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర అనే అంశంపై.. చర్చా గోష్టిలో కేటీఆర్‌ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు తన సొంత నిధులు ఇస్తున్నామన్న ఆలోచన మంచిదికాదన్నారు. రాష్ట్రాలు.. కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తున్న విషయాన్ని మరచిపోవద్దన్నారు. కేంద్రానికి అంశాల వారీగా మద్దతిచ్చిన తాము.. ప్రజా వ్యతిరేక చర్యలను వ్యతిరేకించామన్నారు కేటీఆర్‌.

Next Story

RELATED STORIES