‘‘లవ్ స్టోరి’’ నుంచి ప్రేమికుల రోజున సర్ ప్రైజ్

‘‘లవ్ స్టోరి’’ నుంచి ప్రేమికుల రోజున సర్ ప్రైజ్
X

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’. తెలుగు ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేసుకన్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి సినీ ప్రేమికులను 'ఫిదా' అయిపోయారు. ఇప్పుడు ప్రేమికుల రోజున మరో సర్ ప్రైజ్ ను ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ప్రేమికులకు గుర్తుగా మినిట్ ‘‘మ్యూజికల్ ప్రివ్యూ’’ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ఉదయం 11గం.07 ని లకు సినిమాలోని ‘‘ఏయ్ పిల్లా’’ అనే సాంగ్ ప్రివ్యూ ని రిలీజ్ చేయబోతున్నారు. ఎ.ఆర్ రెహామాన్ శిష్యుడైన సి. హెచ్ పవన్ ఈ సినిమాతో పరిశ్రమకు మ్యూజిక్ డైరక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ లవ్ స్టోరీకి పవన్ సి.హెచ్ అందించిన స్వరాలు మరింత బలమవుతోందని చిత్ర యూనిట్ చెబుతోంది.

అటు శేఖర్ కమ్ముల కెరీర్ లోనే కాకుండా.. ఇటు వరుణ్ తేజ్ కెరీర్ లో కూడా ఫిదా సినిమా బిగ్గెస్ట్ హిట్ కావటంతో.. ఇప్పుడు లవ్ స్టోరీ చిత్రంపై సినీ వర్గాల్లో చాలానే ఉన్నాయి. సున్నితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించే శేఖర్ కమ్ముల విజనరీకి.. ప్రేమకథా చిత్రాల్ల ఇట్టే ఇమిడిపోయే.. నాగ చైతన్య తోడైతే.. ఇక సినిమా మరో స్థాయిలో ఉంటుందని అక్కినేని అభిమానులు అంటున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Next Story

RELATED STORIES