తాజా వార్తలు

ఆ సంస్థలు సాధించిన విజయం ప్రధాని మోదీని సైతం వణికిస్తోంది : మంత్రి జగదీశ్‌ రెడ్డి

ఆ సంస్థలు సాధించిన విజయం ప్రధాని మోదీని సైతం వణికిస్తోంది : మంత్రి జగదీశ్‌ రెడ్డి
X

తెలంగాణ విద్యుత్‌ సంస్థలు సాధించిన విజయం ప్రధాని మోదీని సైతం వణికిస్తోందని, ఆ భయంతోనే తెలంగాణపై విషం కక్కుతున్నారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? అని ఆయా రాష్ట్రాల సీఎంలతో పాటు ప్రధాని సైతం మథనపడుతున్నారని అన్నారు. హైదరాబాద్ మింట్‌ ఆవరణలో జరిగిన విద్యుత్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్‌ ఉద్యోగుల పాత్ర మరవలేనిదన్నారు ఈటల.

Next Story

RELATED STORIES