తాజా వార్తలు

కూల్చడానికి తొందరెందుకు?: తెలంగాణ హైకోర్టు

కూల్చడానికి తొందరెందుకు?: తెలంగాణ హైకోర్టు
X

తెలంగాణ సచివాలయం పాత భవనాన్ని కూల్చివేయరాదని స్పష్టం చేసింది హైకోర్టు. కొత్త భవనం కట్టుకోవడానికి.. పాతభవనం కూల్చివేతపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలన్న ప్రభుత్వ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. కొత్త భవన్‌ ప్లాన్‌తో పాటు పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్‌ దాఖలు చేయాలని గతంలోనే ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. అయితే.. ప్లాన్‌ లేకుండా అఫిడవిట్‌ దాఖలు చేసిన ప్రభుత్వ న్యాయవాది.. ప్లాన్‌ ఇంకా ఫైనల్‌ కాలేదని కోర్టుకు తెలిపారు. ప్లాన్‌ పూర్తి కానప్పుడు కూల్చివేతకు తొందర ఎందుకని ప్రశ్నించింది హైకోర్టు. కొత్త సెక్రటేరియట్‌ భవనం ప్లాన్‌ పూర్తి చేసి.. కాబినెట్‌ అప్రూవల్‌ వచ్చే వరకు పాత భవనాలను కూల్చొద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

Next Story

RELATED STORIES