వేడుక ఏదైనా.. కార్యక్రమం మరేదైనా.. జై అమరావతి నినాదం మారు మోగాల్సిందే

X
TV5 Telugu14 Feb 2020 12:06 PM GMT
వేడుక ఏదైనా సరే... కార్యక్రమం మరేదైనా... జై అమరావతి నినాదం మారు మోగాల్సిందే. ఏపీలో పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో జై అమరావతి నినాదాలు హోరెత్తాయి. తుళ్లూరు గ్రామానికి చెందిన ఉప్పలపాటి సాంబశివరావు కుమార్తె వివాహంలోనూ జై అమరావతి నినాదాలు చేసి.. రాజధాని అమరావతిపై ఉన్న తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దన్నారు. అమరావతి ప్లకార్డులు చేతపట్టి వధూవరులు వివాహం చేసుకున్నారు.
Next Story