ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్‌.. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్‌.. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్‌ అయ్యాయి. ఉభయసభలను ప్రోరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీంతో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. బిల్లులు శాసనమండలి ముందున్నప్పటికీ, సభలను ప్రోరోగ్‌ చేస్తే ఆర్డినెన్స్‌ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్డినెన్స్ తీసుకొస్తే వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు అమలులోకి వచ్చినట్లేనని చెబుతున్నాయి. ఆర్డినెన్స్ జారీతో కార్యాలయాలను కూడా తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది. ఈ బిల్లుతోపాటు.. CRDA రద్దు బిల్లుకు కూడా శాసనసభ ఆమోదముద్ర వేసింది..అయితే ఈ రెండు బిల్లులూ శాసన మండలిలో మాత్రం ఆమోదం పొందలేదు. తీవ్ర ఉత్కంఠ నడుమ ఆ బిల్లులను సెలక్ట్‌ కమిటీలకు పంపిస్తూ మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది..ఏకంగా మండలని రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయితే అధికారికంగా మండలి రద్దు అయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈలోపే ఆ రెండు బిల్లులపై ఆర్డినెన్స్‌ తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం..

ప్రభుత్వ తీరుపై టీడీపీ భగ్గుమంటోంది..ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చినా బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ బిల్లుగా పెట్టాల్సిందేనని ఆపార్టీ నేతలు చెబుతున్నారు..కౌన్సిల్ రద్దు అధికారికంగా జరిగే వరకు మండలి సమావేశాలు జరపాల్సిందేనని డిమాండ్ చేశారు..బైట్ యనమల

అటు శాసనమండలి కార్యదర్శి తీరుపై శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కుదరదంటూ ఫైల్‌ను తిప్పిపంపడాన్ని ఛైర్మన్ తప్పుబట్టారు. వెంటనే సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసి తనకు నివేదించాలని ఆదేశించారు. 48 గంటల్లో సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాల్సిందేనని మరోసారి తేల్చిచెప్పారు. ఇంకా జాప్యం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.

ప్రభుత్వం 3 రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటి నుంచి అమరావతి భగ్గుమంటోంది. రెండు నెలలుగా 29 గ్రామాల్లో ఉద్యమ సెగలు ప్రజ్వరిల్లుతున్నాయి. ధర్నాలు, రిలే దీక్షలు, వినూత్న నిరసనలతో హోరెత్తిస్తున్నారు..బాధతో ఇప్పటికే చాలా మంది చనిపోయారు..అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. 3రాజధానుల నిర్ణయాన్ని అత్యంత వేగంగా అమలు చేసేందుకు మొండిగా ముందుకెళ్తోంది.

Tags

Read MoreRead Less
Next Story